ఐటీ కారిడార్ లో కారు పూలింగ్ విధానం

ఐటీ కారిడార్ లో కారు పూలింగ్ విధానం

గ్రేటర్ హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో కారు పూలింగ్ విధానం తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. రహదారులపై వాహనాల రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీ కంపెనీలతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐటీ కంపెనీల తరపునే ఉద్యోగులకు రవాణా ఏర్పాటు చేయాలని మరో ప్రతిపాదన సూచించారు. ఐటీ ఉద్యోగులందరూ ఒకేసారి రహదారులపైకి రాకుండా.. డ్యూటీ ముగింపు వేళల్లో మార్పులు చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మంగళవారం, బుధవారం, గురువారాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని, ఈ విషయాన్ని ఐటీ కంపెనీలు దృష్టిలో ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఐటీ కంపెనీలు పరిగణలోకి తీసుకోవాలని పోలీసులు కోరారు.