హ్యాట్రిక్ పై ఈ ఇద్దరు నేతల ఆశలు.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?

హ్యాట్రిక్ పై ఈ ఇద్దరు నేతల ఆశలు.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు లీడర్లు పొలిటికల్ వ్యూహాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈసారి ఎలక్షన్లలో గెలిస్తే హ్యాట్రిక్ రికార్డు అవకాశం ఉన్న ఆ లీడర్లు భవిష్యత్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. లోకల్ గా పార్టీలో జరుగుతున్న ప్రచారంపై ఇద్దరు లీడర్ల అనుచరుల్లో చర్చకు దారి తీసింది. 

వరంగల్ ఎంపీగా బైపోల్ లో ఒకసారి, గత ఎన్నికల్లో రెండోసారి గెలిచారు పసునూరి దయాకర్. ఈసారి గట్టి పోటీ ఉంటుందని అంచనాలున్నాయి. అయితే.. ఎంపీని సొంత పార్టీ ఎమ్మెల్యేలే పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ ఆయన అనుచరుల్లో ఉంది. దీంతో మూడోసారి అవకాశంపై జిల్లా పార్టీలో చర్చ మొదలైంది. దీనికి తోడు ఎంపీ టికెట్ కోసం పలువురు లీడర్లు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఎంపీ కూడా ఓ కీలకనేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు హ్యాట్రిక్ టార్గెట్ గా చాలా ఆశలుపెట్టుకున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. హ్యాట్రిక్ కొడితే ఈసారి తనకు పెద్ద పోస్ట్ గ్యారంటీ అని ఆయన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం వేరే ప్లాన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరూరి సీటు మార్చే అవకాశం ఉన్నట్లుగా జిల్లా పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం మొదలైంది. అయితే దీన్ని ఆరూరి వర్గం ఖండిస్తోంది. వర్ధన్నపేట మీదే ఆయన ఇంట్రెస్ట్ అని చెబుతున్నారు. సీటు మారకుండా పెద్ద నేతలతో మాట్లాడుతున్నట్లు టాక్. 

సందట్లో సడేమియాలా మరికొందరు నాయకులు తెరపైకి వస్తుండడం టిక్కెట్లు ఆశిస్తున్న లీడర్లను టెన్షన్ పెడుతోంది. జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో పని చేసిన ఆయనకు పార్టీ ముఖ్య నేతతో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ నేత ద్వారా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టాక్. దీంతో ఎవరి సీటు మారుతుంది..? ఎవరి ఆశలు గల్లంతవుతాయి..? ఎవరికి చాన్స్ దొరుకుతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది.