‘పొన్నియిన్‌‌ సెల్వన్‌‌’ నుంచి పోస్టర్ రిలీజ్

‘పొన్నియిన్‌‌ సెల్వన్‌‌’ నుంచి పోస్టర్ రిలీజ్

విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధానపాత్రల్లో మణిరత్నం రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్‌‌ సెల్వన్‌‌’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌‌ పార్ట్‌‌ కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో విడుదలైంది. రెండో భాగం రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్‌‌ మొదలు పెట్టిన టీమ్.. ‘ఆగనందే’ అంటూ సాగే పాటను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌ ఆకట్టుకుంటోంది. ఓ నది ఒడ్డున కళ్లకు గంతలు, చేతులు వెనక్కు కట్టేసి ఉన్న కార్తి, మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. వీరఖడ్గం చేతిలో పట్టుకుని అతని వైపే చూస్తోంది త్రిష. వీళ్లిద్దరి లవ్‌‌ స్టోరీని మణిరత్నం ఈ పాటలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఏప్రిల్‌‌ 28న సినిమా విడుదల కానుంది.