తార్నాక, వెలుగు: స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన మూడో జాతీయ స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్లో మన చిన్నారులు సత్తా చాటారు. డిసెంబర్ 27 నుంచి 29 వరకు తమిళనాడు సేలంలో నిర్వహించిన ఈ పోటీల్లో తెలంగాణ జట్టు మొదటి స్థానంలో నిలిచి, ఛాంపియన్ షిప్ ట్రోఫీని గెలుచుకుంది.
వీరిని బుధవారం తార్నాకలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి అభినందించారు. ఈ విజయంతో తెలంగాణ చిన్నారులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విజేతలు ఆర్. గ్రీషిక (గోల్డ్), బూరి ఎలినా (గోల్డ్), సునిధి చంద్ర (గోల్డ్), కనిష్క (గోల్డ్), సహస్ర (గోల్డ్), వైశాలి (గోల్డ్), మిష (సిల్వర్), అనన్వీర్ జైన్ (సిల్వర్), సంతోష్ (బ్రాంజ్), కమల (బ్రాంజ్), అసోసియేషన్ అధ్యక్షుడు ఇస్మాయిల్, జనరల్ సెక్రటరీ రాజాసింగ్, అడ్వైజర్ డేవిడ్, జీహెచ్ఎంసీ జిమ్నాస్టిక్స్ కోచ్ హనుమాన్ నాయక్ పాల్గొన్నారు.
