బీఆర్ఎస్ హయాంలోనే విద్యుత్​ రంగం ఆగం : రాజగోపాల్​ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలోనే విద్యుత్​ రంగం ఆగం :  రాజగోపాల్​ రెడ్డి

 

  •  అవినీతి చేసినందుకే ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్​ దక్కలేదు
  • అసెంబ్లీకి రాని కేసీఆర్​కు ప్రతిపక్ష హోదా ఎందుకు?   

హైదరాబాద్, వెలుగు: విద్యుత్‌‌‌‌ రంగంపై గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ఆరోపించారు. వాళ్ల హయాంలోనే విద్యుత్ రంగం ఆగమయ్యిందని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్​పై పద్దు చర్చ సందర్భంగా ఆయన  మాట్లాడారు. " గతంలో రైతులకు ఉచిత విద్యుత్‌‌‌‌ ఇచ్చిందే కాంగ్రెస్‌‌‌‌. ఇప్పుడు కూడా గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. 

రాబోయే రోజుల్లో పవర్ సెక్టారులో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టి రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తాం.గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం అన్నీ సక్రమంగా చేస్తే  విద్యుత్‌‌‌‌ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి. పదేళ్ల కాలంలో విద్యుత్తు లైన్ల షిఫ్టింగ్ జరగలేదు. అడిషనల్ ట్రాన్స్ ఫార్మర్స్  అందించలేదు.  యాదాద్రి పవర్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ లాభదాయకం కాదని 2018లోనే చెప్పా. వేల కోట్లు ఖర్చు పెట్టినా  పవర్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ పూర్తికాలేదు. విభజన చట్టంలోని రామగుండం కాదని యాదాద్రిలో పవర్‌‌‌‌ప్లాంట్‌‌‌‌ ఎందుకు కట్టారు. ప్రాజెక్ట్‌‌‌‌ అంచనాలను ఇష్టానుసారంగా పెంచారు. 

బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌కు రూ.20 వేల కోట్ల పనులు నామినేటెడ్‌‌‌‌ పద్ధతిన ఇచ్చారు. బొగ్గు అందుబాటులో ఉన్నచోటే పవర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ పెట్టాలి. కానీ బొగ్గు గనులకు 280 కిలో మీటర్ల దూరంలో ఉన్న దామరచర్ల దగ్గర థర్మల్‌‌‌‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. డిస్కంలను లాభాల్లోకి  తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న మాపైనే మళ్లీ నిందలు వేస్తున్నారు. ఇది సరికాదు.బీఆర్ఎస్ చేసిన తప్పలు ఒప్పుకుని కరెంట్ కొనుగోళ్ల విషయంలో సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటాం" అని రాజగోపాల్​ రెడ్డి పేర్కొన్నారు. 

కేసీఆర్‌‌‌‌ సభకెందుకొస్తలే?

మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ ఎందుకు సభకు రావడం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకని నిలదీశారు. " తెలంగాణకు తాను రాజునని, తన తర్వాత కేటీఆరే రాజు కావాలని కేసీఆర్ భావించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడుతుంటే  మైక్ కట్ చేసేవారు. వందమంది కౌరవులలాగా మాపై దాడి చేశారు. సారు..కారు..పదహారు..అని విర్ర వీగినందుకు మొన్నటి ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోట్లాడుతుంటే నా జీవితం ధన్యమైందని చాలా సంతోషించా.

 కానీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​ ఆ సంతోషం లేకుండా చేసింది. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి  పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ లేకుండా చేశారంటే ఎంత అవినీతి చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మేం చేసే మంచి పనులకు సహకరించాలని  ప్రతిపక్ష పార్టీని కోరుతున్నా" అని రాజగోపాల్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.