ప్రజాసంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలి : రావుల రాంనాథ్

ప్రజాసంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలి : రావుల రాంనాథ్

లక్ష్మణచాంద/జన్నారం,వెలుగు: సంగ్రామ యాత్రను సక్సెస్​చేయాలని బీజేపీ పెద్దపెల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రాంనాథ్ కోరారు. ఆదివారం నిర్వహించిన లక్ష్మణచాంద మండల బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొట్టడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. వచ్చేనెల 3న నిర్మల్​లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మెంగు అనిల్, ప్రధాన కార్యదర్శులు గాండ్ల విఠల్, రాజు, ఉపాధ్యక్షులు లింగం, ముత్యంరెడ్డి ముత్తన్న, రంజిత్, కార్యదర్శులు గంగాధర్, రాజు, రమేశ్​తదితరులు పాల్గొన్నారు. జన్నారంలో నియోజకవర్గ బీజేపీ లీడర్ హరినాయక్ మాట్లాడారు. ప్రజాసంగ్రామ యాత్రను సక్సెస్​చేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల ప్రెసిడెంట్​గోలిచందు, లీడర్లు జక్కుల సురేశ్, కొండపల్లి మహేశ్, బీజేవైఎం మండల ప్రెసిడెంట్ ముడుగు ప్రవీణ్, బాదంపెల్లి మాజీ సర్పంచ్ వొజ్జల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలు భారీగా హాజరుకావాలి...

లోకేశ్వరం,వెలుగు: నిర్మల్​ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్​ చేయాలని ముథోల్ నియోజక వర్గ సంగ్రామ యాత్ర ఇన్​చార్జి ఎర్ర మహేశ్ ​కోరారు. ఆదివారం లోకేశ్వరం లో ఆయన  మీడియాతో మాట్లాడారు. భైంసాలో నిర్వహించే బహిరంగ సభలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. సమావేశంలో లీడర్లు గంగాధర్, నల్ల రమేశ్ తదితరులు ఉన్నారు.