కిలాడీ మహిళల చిలిపి దొంగతనం

కిలాడీ మహిళల చిలిపి దొంగతనం

తిరుపతి: తిరుమలలో కిలాడి లేడీలు చిలిపిదొంగతనం సీసీ కెమెరాలో రికార్డయింది. అమాయకుల మాదిరిగా చేతివాటం ప్రదర్శించిన వైనం చూసిన వారు ఔరా… చున్నీని కూడా వదల్లేదే అనుకుంటూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1కు వెళ్లే మార్గంలో ఉన్న ఓ దుకాణంలో జరిగిందీ చున్ని చోరీ ఘటన. పవిత్రమైన స్థలంలో ఎలాంటి అపవిత్ర కార్యకలాపాలకు తావు లేకుండా దేవస్థానం పాలకమండలి వారు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి దుకాణం వారు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చేయడంతో ఈ చిలిపిదొంగతనం రికార్డయింది.  ఒక చున్ని కొన్న తర్వాత దుకానం నిర్వాహకుడిని మాటల్లో ఉంచి చాకచక్యంగా మరో చున్నీ కొట్టేశారీ కిలాడీ మహిళలు. చున్నీ కొట్టేసి ఏమీ తెలియనట్లు చోరీ చేసి అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి చోరీకి పాల్పడ్డ తల్లి కూతుర్ల నిర్వాకం సిసి కెమెరాలో రికార్డయింది. సీసీ కెమెరా విజువల్స్ చూసిన వారు..  పుణ్యం కోసం ఇంత దూరానికి వచ్చి ఈ పాడు పనేంటి అనుకుంటున్నారు. విజిలెన్స్, పోలీస్ అధికారులు ఆదేశాలతో తిరుమలలో ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ఈ తల్లీకూతుళ్లెవరో జాగ్రత్త అనుకుంటూ సీసీ కెమెరా వీడియోను వైరల్ చేస్తున్నారు. తిరుమల కొండపై నిఘా మరీ ఎక్కువ వుంటుంది. అయినా చేతి వాటం ప్రదర్శించారు ఈ తల్లీ కూతుళ్లు.

ఇవి కూడా చదవండి

సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది

AP సర్కార్ కు హైకోర్టులో ఊరట

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన సర్జరీ:  నుజ్జునుజ్జయిన చేతిని అతికించారు