ప్రధాని ఏమాత్రం సారం లేని ప్రసంగం చేశారు

ప్రధాని ఏమాత్రం సారం లేని ప్రసంగం చేశారు

న్యూఢిల్లీ: ఎల్‌ఏసీ వద్ద చైనా దురాక్రమణ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, రైల్వే రిక్రూట్‌మెంట్...తదితర అంశాలపై ప్ర‌ధాని మోడీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మీడియా సమావేశంపై రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు  . ప్రధాని ఏమాత్రం సారం లేని ప్రసంగం చేశారని అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో, 2014 నుంచి ప్రభుత్వం చేసిన పనులు గురించి మాట్లాడరని, ఎల్‌ఏసీ వద్ద చైనా దురాక్రమణ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, రైల్వే రిక్రూట్‌మెంట్...తదితర అంశాలపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని అన్నారు. ఆయన మాటల్లో సారం అంటూ ఏమీ లేదని, ఆయన మాటలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దంపడుతున్నాయని విమర్శించారు.


దీనికి ముందు, మీడియాతో ప్రధాని మాట్లాడుతూ, దేశాభివృద్ధికి ఇదే కీలక సమయమని, దేశ ఆర్థిక పురోగతి, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటి అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంపొందించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వేదక కావాలని అన్నారు. వీటిపై అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.