గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. గతంలో వీరిద్దరు కలిసిన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఈ సూపర్ కాంబో నాలుగో సారి తెరపైకి రాబోతోంది. NBK111 చిత్రంపై ఉత్కంఠ పెంచేస్తూ. మంగళవారం ఉదయం ( నవంబర్ 18న ) ఈ భారీ ప్రాజెక్ట్‌లో నయనతార కథానాయికగా అధికారికంగా చేరినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వార్తతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టును వృద్ది సినిమాస్ , మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నయనతార 40వ పుట్టినరోజు కానుకగా..
ఈ చిత్రంలో నయనతార కథానాయికగా చేరినట్లు మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. మరింత సంతోషకరమైన విషయం ఏమిటంటే.. నయనతార తన 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చారిత్రక యాక్షన్ చిత్రంలో తాను భాగమవుతున్నట్లు స్వయంగా తన 'X' వేదికగా ప్రకటించారు. ఆమె పోస్ట్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో అద్భుతంగా ఉంది. “The Queen enters the Empire” (సామ్రాజ్యంలోకి రాణి అడుగుపెట్టింది) అనే ఆమె క్యాప్షన్ ఫ్యాన్స్ లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఉద్వేగభరితమైన సంగీతం, గ్రాండ్ విజువల్స్‌తో కూడిన ఈ స్నిప్పెట్స్, నయనతార పోషించబోయే శక్తివంతమైన, చారిత్రక మహిళా పాత్ర గొప్పతనాన్ని పరిచయం చేశాయి. 'మనా శంకర వరప్రసాద్ గారు' వంటి ప్రతిష్టాత్మక తెలుగు ప్రాజెక్ట్ తర్వాత నయన్ కు ఇది మరో మైలురాయి కానుంది.
యుద్ధాన్ని నడిపించే వీర వనితగా..
ఈ చిత్రం కథాంశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. NBK111 చారిత్రక యాక్షన్ ఎపిక్‌గా రూపొందుతోంది. బాలయ్య ఇందులో మహారాజు పాత్రలో కనిపిస్తారని సమాచారం. నయనతార పాత్ర కూడా కేవలం హీరోయిన్‌కే పరిమితం కాకుండా, 'వీర వనిత' లేదా 'యుద్ధాన్ని నడిపించే క్వీన్' పాత్రలో పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. చారిత్రక కుట్రలు, మాస్ యాక్షన్ అంశాలు కలగలిసిన కథనంతో ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు..
బ్లాక్‌బస్టర్ కాంబో రిపీట్ ..
బాలకృష్ణ-నయనతార కాంబోకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పట్టారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'సింహా', 'శ్రీ రామరాజ్యం', 'జై సింహా' చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇది వీరిద్దరి కలయికలో నాల్గవ చిత్రం కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. 2023 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఆ విజయం తర్వాత వస్తున్న వీరి రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ సినిమా లాంఛింగ్ అక్టోబర్‌లో జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ నవంబర్ 26, 2025 న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు వృద్ది సినిమాస్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనుండడం వలన, నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. వృద్ది సినిమాస్ బ్యానర్ ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అఖండ 2' చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఒకవైపు 'అఖండ 2' తో మాస్ జాతరకి సిద్ధమవుతూనే, మరోవైపు నయనతారతో కలిసి చారిత్రక సంచలనం సృష్టించడానికి బాలయ్య సిద్ధమవుతున్నారు. ఈ మహారాజు-మహారాణి కలయిక సినీ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
The Queen enters the Empire 👸🏼
— Nayanthara✨ (@NayantharaU) November 18, 2025
world of #NBK111
GOD OF MASSES #NandamuriBalaKrishn pic.twitter.com/7xxBR6BGyh
