ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ఈ మూవీ నుంచి ఆదివారం (నవంబర్ 23న) ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ పాట విడుదలైంది. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి ఇచ్చిన స్పీచ్తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.
‘‘సినిమా గురించి ఏం చెప్పినా ఆ కటౌట్కి తక్కువ అయిపోతాయి. నేను ప్రస్తుతానికి రెబెల్ యూనివర్సిటీ లో చదువుకుంటున్న. రెండేళ్ల క్రితం ఆ యూనివర్సిటీ లో జాయిన్ అయినప్పటి నుండి ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ ముందు ఆ మాటలు చిన్నవి అవుతాయి’’ అని కామెంట్ చేశారు.
కానీ, ఇపుడు ఇదే స్పీచ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని హర్ట్ చేస్తుంది. అయితే, గతంలో ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తూ.. సినిమా సక్సెస్ అవుతుందని బలంగా చెప్పారు. కానీ సినిమా పరిస్థితి తేడా కొట్టింది. ఈ క్రమంలో 'కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను' అనే మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ని హర్ట్ చేసింది.
ఎన్టీఆర్‌ను ఉద్దేశించే మారుతి ఈ కామెంట్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలా పోస్ట్ పెట్టిన ఒక ఎన్టీఆర్ అభిమానికి డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇస్తూ.. తన స్పీచ్పై వివరణ ఇచ్చారు.
ALSO READ : నేను ఒరిజినల్..
డైరెక్టర్ మారుతి X వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రతి సినిమా అభిమానికి నేను నా కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. ముందుగా ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు. కొన్నిసార్లు స్టేజ్‌పై మాట్లాడే టైంలో ఒక్కోసారి ఇలాంటి మాటలు దొర్లుతుంటాయి. నేను మాట్లాడిన దాన్ని అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను. నా కామెంట్స్ ఇలా ప్రజల్లోకి వెళ్లినందుకు చాలా బాధగా ఉంది.
నాకు ఎన్టీఆర్ గారి పట్ల మరియు ఆయన అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉంది. ప్రతి అభిమాని సినిమాలకు ఇచ్చే విలువను చూసి నేను చాలా సంతోషిస్తాను. నేను ఆయనని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదు. దీనిపై నేను మనస్ఫూర్తిగా నిజాయితీతో వివరణ ఇస్తున్నాను. దయచేసి నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని మారుతి వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.
హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
