రెబల్ స్టార్ ప్రభాస్ , దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్ ఫాంటసీ , రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సంక్రాంతికి కానుకగాఈ సినిమా జనవరి 9, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీపై అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ మరో అప్డేట్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు.
‘నాచే నాచే’ పాటతో రచ్చ!
లేటెస్ట్ గా ముంబైలో జరిగిన ఒక మెగా ఈవెంట్‌లో ‘నాచే నాచే’ (Naache Naache) ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట 1982లో వచ్చిన మిథున్ చక్రవర్తి ఐకానిక్ హిట్ ‘ఆవా ఆవా కోయి యహాన్ నాచే’ (డిస్కో డ్యాన్సర్) కు రీమిక్స్ కావడం విశేషం. ఎస్. తమన్ నేటి కాలపు ట్రెండ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ బీట్స్‌తో ఈ పాటను రీఇన్వెంట్ చేశారు. నకాష్ అజీజ్, బృందా తమ గొంతుతో ఎనర్జీని నింపారు. ఈ పాటలో డార్లింగ్ తన సిల్వర్ బ్లింగ్ కాస్ట్యూమ్స్ , అదిరిపోయే స్టెప్పులతో వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ల గ్లామర్ ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. ఈ పాట కేవలం రీమిక్స్ మాత్రమే కాదు, ఇది రాజా సాబ్ ఆత్మ. తిరుగుబాటు, గ్లామర్ , ఉత్సాహం కలగలిసిన డ్యాన్స్ అంతెమ్ ఇది అని పేర్కొన్నారు. క్లాసిక్ సాంగ్స్ బాధ్యతతో కూడుకున్నవి. ఒరిజినల్ హుక్‌ను కాపాడుతూనే, థియేటర్లు దద్దరిల్లేలా సౌండ్‌స్కేప్‌ను మార్చాం తమన్ అని తెలిపారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉంది. అభిమానులు ఉత్సాహం రెట్టింపు స్థాయిలోకి దూసుకెళ్లింది.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
యూఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్ ధర 1,000 డాలర్ల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభాస్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల పైనే ఉండబోతోందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంక్రాంతి బరిలో ప్రభాస్ జోరు
జనవరి 9న రిలీజ్ కానున్న 'ది రాజా సాబ్'తో పాటు 'జన నాయగన్', 'మన శంకర వర ప్రసాద్ గారు', 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. అయితే ‘కల్కి 2898 AD’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఇది ప్రభంజనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.
