
పటాన్ చెరు రూరల్, వెలుగు: రామచంద్రపురం సిట్టింగ్ కార్పొరేటర్ మధ్యాహ్నం బీజేపీ పార్టీలో చేరి, సాయంత్రం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. కార్పొరేటర్ తొంట అంజయ్య టీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ సీటు దక్కపోవడంతో మనస్తాపం చెంది గురువారం మధ్యాహ్నం బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన రామచంద్రాపురం చేరుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో కలిసి కార్పొరేటర్ తొంట అంజయ్యను బుజ్జగించారు. కొన్ని గంటల వ్యవధిలోనే విలేకరుల సమావేశంలో ఆయనకు కండువా కప్పి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోచేర్చుకున్నారు.