మంచు తొవ్వలో మారథాన్​

మంచు తొవ్వలో మారథాన్​

మారథాన్​ పోటీల గురించి వినే ఉంటారు. కానీ, ఈ మారథాన్​ మాత్రం సమ్​థింగ్​ స్పెషల్​. ఎందుకంటే... మైనస్​ 53 డిగ్రీల టెంపరేచర్​లో పరిగెత్తారు వీళ్లు. దారి పొడవునా మంచు, వణికించే చల్లని గాలులు.. ఇలాంటి వాతావరణంలో అడుగు బయట పెట్టాలంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, వీళ్లు మాత్రం మంచు దారిలో సాహసం చేస్తూ,  ఉత్సాహంగా కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తారు. రష్యాలోని యకుతియాలో ‘పోల్​ ఆఫ్​ కోల్డ్​’గా పిలిచే ఒయ్​మైఅకోన్​ లోయలో ఈ మారథాన్​ ​ జరిగింది. ‘వరల్డ్​ కోల్డెస్ట్​ మారథాన్’గా గిన్నిస్​ రికార్డుల్లో చోటు దక్కించుకున్న ఈ మారథాన్​ సంగతులివి...

రష్యాలో సైబీరియా ఎడారికి దగ్గర్లో ఉంటుంది యకుతియా రిపబ్లిక్​. ఇక్కడ వింటర్​లో టెంపరేచర్​ మైనస్​ డిగ్రీల్లో ఉంటుంది. దాంతో అడ్వెంచర్​ స్పోర్ట్స్​ని ఇష్టపడేవాళ్ల కోసం ఇలాంటి మారథాన్​లు పెడతారు. ఈ ఏడాది మారథాన్​ జనవరి 21న పొద్దున్నే​ మొదలైంది. చేతులకి గ్లోవ్స్, నెత్తికి మంకీ క్యాప్, స్వెటర్, షూ వేసుకుని వచ్చారు పార్టిసిపెంట్స్. ఈ మారథాన్​లో రష్యా, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​, అమెరికా, బెలారస్​కు చెందిన 65 మంది పోటీపడ్డారు. వీళ్లలో ఎక్కువమంది 40–49 ఏండ్ల లోపువాళ్లే. వందమందికిపైగా స్థానికులు రోడ్డుకి రెండు పక్కల నిల్చొని, చప్పట్లు కొడుతూ  పార్టిసిపెంట్స్​ని ఎంకరేజ్​ చేశారు. ఈ పోటీలో స్పోర్ట్స్​ స్కూల్​ టీచర్​ వసిలీ లుకిన్​ 3 గంటల 22 నిమిషాల్లో ఫినిషింగ్​ లైన్​ చేరుకుని విజేతగా నిలిచాడు. యుకుతియాలో ‘కోల్డెస్ట్ మారథాన్’ నిర్వహించడం ఇది మూడోసారి​. ఈ ఏడాది మారథాన్​ మరింత స్పెషల్​ అంటున్నారు నిర్వాహకులు​. అందుకు కారణం... సోవియట్​ యూనియన్​ నుంచి యకుతియా వేరుపడి స్వతంత్ర దేశంగా అవతరించి ఈ ఏడాదికి వందేండ్లు.