గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. గ్రామం, వార్డులు ఏ సామాజికవర్గానికి కేటాయించారో తేలిపోయింది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, జోగుళాంబ గద్వాల, మెదక్ వంటి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు రిజర్వేషన్ల జాబితాలు అందాయి.
చాలా జిల్లాల్లో ఆయా కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, జోగుళాంబ గద్వాల, మెదక్ వంటి జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడి కలెక్టర్లు గెజిట్ నోటిఫకేషన్లను జారీ చేసే పనిలో ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 248 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లు: వంద శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాలు 7 ఉన్నాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు 5 కేటాయించారు. నాన్ షెడ్యూల్ ఏరియాల్లో ఎస్టీ మహిళలకు 9, ఎస్టీ జనరల్‌కు 12, ఎస్సీ మహిళలకు 23, ఎస్సీ జనరల్ 28 స్థానాలు దక్కాయి. ఓవరాల్‌గా బీసీ మహిళలకు 21, బీసీ జనరల్‌కు 25 స్థానాలు కేటాయించారు. అన్రిజర్వ్డ్ స్థానాల్లో మహిళలకు 59, జనరల్ 64 స్థానాలు దక్కాయి.
ఖమ్మం జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లు: జిల్లాలో వందశాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాలు 11 ఉన్నాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 3, ఎస్టీ జనరల్‌కు 8 కేటాయించారు. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీ మహిళకు 48, ఎస్టీ జనరల్51, నాన్ షెడ్యూల్ ఏరియా ఎస్టీ మహిళలకు 25, ఎస్టీ జనరల్‌కు 36, ఎస్సీ మహిళలకు 48, ఎస్సీ జనరల్‌కు 62, బీసీ మహిళలకు 24, బీసీ జనరల్‌కు 30, అన్రిజర్వ్డ్ స్థానాల్లో మహిళలకు 112, జనరల్ 124 స్థానాలు కేటాయించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లు: ఎస్టీలకు సున్న, ఎస్సీలకు 3 స్థానాలు (ఇందులో ఎస్సీ మహిళకు 1, ఎస్సీ జనరల్ 2) కేటాయించారు. బీసీలకు 4 స్థానాలు కేటాయించగా.. ఇందులో బీసీ మహిళలకు 2, బీసీ జనరల్‌కు 2 దక్కాయి. అన్రిజర్వ్డ్ స్థానాలు 7 ఉండగా.. ఇందులో మహిళలకు 3,జనరల్ 4 దక్కాయి.
మెదక్ జిల్లాలో 492 గ్రామ
పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లు: జిల్లాలో వందశాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో ఎస్టీ మహిళకు 29, ఎస్టీ జనరల్ 42 సీట్లు దక్కాయి. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీ మహిళలకు 10, ఎస్టీ జనరల్‌కు 11,ఎస్సీ మహిళలకు 33, ఎస్సీ జనరల్‌కు 44,బీసీ మహిళలకు 49, బీసీ జనరల్‌కు 59 సీట్లు కేటాయించారు. అన్రిజర్వ్డ్ స్థానాల్లో మహిళలకు 102, జనరల్ 113 స్థానాలు దక్కాయి.
