మూడో వన్డే ఫలితం.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ పై ప్రభావం

మూడో వన్డే ఫలితం..  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ పై ప్రభావం

రేపు న్యూజిలాండ్ తో జరగబోయే మూడో వన్డేలో భారత్ కు గట్టి సవాల్ ఎదురవ్వబోతుంది. టీ20 సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో గట్టి పోటీ ఇవ్వాలని బరిలోకి దిగిన కివీస్, భారత్ పై మొదటి మ్యాచ్ అలవోకగా గెలిచింది. రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ రేస్ లో ఉండాలనుకున్న టీం ఇండియా ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. అయితే, రేపు జరగబోయే మూడో వన్డే, సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది. 

ఈ మ్యాచ్ ఫలితం టీం ఇండియా ఐసీసీ ర్యాంక్ పైన కూడా ప్రభావం ఉండబోతుంది. 2023లో జరగబోయే వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ర్యాంకింగ్స్ తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. హోస్ట్ గా ప్రపంచకప్ కు డైరెక్ట్ క్వాలిఫై అయిన భారత్, ప్రస్తుతం ఐసీసీ క్వాలిఫైయింగ్ సూపర్ లీగ్ పాయింట్స్ టేబుల్ లో 134 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, రేపు న్యూజిలాండ్ తో జరగబోయే మూడో మ్యాచ్ లో ఓడితే న్యూజిలాండ్ మొదటి స్థానికి, భారత్ రెండో స్థానానికి పడిపోయే అవకాశం ఉంటుంది.