లిక్కర్​ దరఖాస్తుల రాబడి రూ.975.68 కోట్లు

లిక్కర్​ దరఖాస్తుల రాబడి రూ.975.68 కోట్లు

 స్పెషల్​ సీఎస్​ సోమేశ్​ కుమార్​ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: మద్యం దుకాణాల దరఖాస్తులతో 975.68 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్​ శాఖ ఇన్​చార్జి కమిషనర్​, స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ సోమేశ్​ కుమార్​ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  2,216 దుకాణాలకు 48,784 దరఖాస్తులు వచ్చాయన్నారు. గురువారం మద్యం దుకాణాల దరఖాస్తులపై ఆయన మాట్లాడారు. ఒక్కో దుకాణానికి సగటున 22 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రెవెన్యూ రూ.463 కోట్లు పెరిగిందన్నారు. బీరు మార్జిన్​ తగ్గించడం వల్ల రూ.200 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఏడాదికి రూ.5 లక్షల పన్నుతో రూ.111 కోట్ల రాబడి వస్తుందన్నారు. తక్కువ పోటీ ఉన్న 29 చోట్ల రెండు రోజులు దరఖాస్తు గడవును పొడిగించామని చెప్పారు. దీంతో 382 అప్లికేషన్లు ఎక్కువ రాగా, రూ.7.64 కో అదనంగా 7.64 కోట్ల రెవెన్యూ వచ్చిందని తెలిపారు. నవంబర్‌‌ ఒకటో తేదీ నుంచి 2021 అక్టోబర్‌‌ ఒకటో తేదీ వరకు కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

The revenue of Liquor applications value is Rs 975.68 crore says Special CS