
కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. గత 20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడిందని విమర్శించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తానన్న రేవంత్..అన్ని అబద్దాలే ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది..కానీ కల్వకుర్తి ద్వారా నీటిని తీసుకోవడం మనోళ్లకు చేతకావడం లేదని మండిపడ్డారు హరీశ్ రావు. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు,నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని ఆరోపించారు హరీశ్ రావు.
వారం రోజుల్లో మోటార్లు ఆన్ చెయ్యాలి
వారం రోజుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసిన రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. లేకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామన్నారు. ఇవి తాను చెబుతున్న మాటలు కాదని..స్వయంగా కేసీఆర్ చెప్పారని..ఆయన డైరెక్షన్ మేరకే ఇవాళ ప్రెస్ మీట పెట్టానని చెప్పారు హరీశ్.
►ALSO READ | జులై 10న తెలంగాణ కేబినెట్..చర్చించే అంశాలివే..!