పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో చోరీ

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో చోరీ
  • రూ.40 లక్షల విలువైన కాపర్ బండిల్స్​ దొంగతనం

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్​కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌లో దొంగలు పడ్డారు. 38 కాపర్‌‌‌‌ బండిల్స్ ఎత్తుకెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌‌‌ 12లో సర్కార్ నిర్మిస్తున్న పోలీస్​ కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌ పనులు చివరి దశకు చేరాయి. ఈ నిర్మాణ పనులు శాపూర్ని పలోనే అనే కంపెనీ చేస్తున్నది.  మరో మూడు నుంచి నాలుగు నెలల్లో కొన్ని విభాగాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటీరియల్స్‌‌, కేబుల్స్‌‌ కోసం కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో కాపర్‌‌‌‌బండిల్స్‌‌ కొనుగోలు చేశారు. 2 న వీటిలో సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే సుమారు 38 కాపర్ బండిల్స్ చోరీ అయ్యాయి. ఇది గుర్తించిన ప్రాజెక్ట్‌‌ మేనేజర్ సురేష్ కృష్ణ, బంజారాహిల్స్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌‌ ఆధారంగా టవర్స్ పరిసర ప్రాంతాల్లో సెర్చ్‌‌చేశారు. అనుమానితులను విచారించగా.. కేసు ఓ కొలిక్కి వచ్చిందని, నిందితులను పట్టుకున్నామని బంజారాహిల్స్ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వరరావు తెలిపారు.