వైద్య సేవల్లో ఎన్జీవోల పాత్ర అభినందనీయం: గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ

వైద్య సేవల్లో ఎన్జీవోల పాత్ర అభినందనీయం: గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సమాజంలోని బలహీన వర్గాలకు వైద్య సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ప్రశంసనీయమని గవర్నర్ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ అన్నారు. రాజ్‌‌‌‌భవన్​లో సోమవారం డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పిట్టి ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన హెల్త్ క్యాంపును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​తో కలిసి ఆయన ప్రారంభించారు. 

దివ్యాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలు, కర్రలు, వీల్​చైర్లు పంపిణీ చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఎం.వీరయ్య, కలెక్టర్ హరిచందన , డాక్టర్ విజయ భాస్కర్, రెడ్ క్రాస్ చైర్మన్ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 900 మందికిపైగా శిబిరంలో పాల్గొనగా, 71 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు.