
హైదరాబాద్, వెలుగు: వాలీబాల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం ఈ మెగా లీగ్ మొదలనుంది. మొత్తం పది జట్లు బరిలో నిలిచిన ఈ టోర్నీలో తొలి రోజు ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్ హాక్స్, డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్‌తో తలపడనుంది. బ్లాక్ హాక్స్‌కు బ్రెజిల్ ప్లేయర్ పాలో లమోనీర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, కాలికట్ జట్టును మోహన్ ఉక్రపాండియన్ నడిపిస్తున్నాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పది జట్ల కెప్టెన్లతో కలిసి లీగ్ ఆర్గనైజర్లు ట్రోఫీని ఆవిష్కరించారు.