నాప్​కిన్స్ వాడకంపై అవగాహన కార్యక్రమం

నాప్​కిన్స్ వాడకంపై అవగాహన కార్యక్రమం

ఒకప్పటితో పోల్చితే శానిటరీ నాప్​కిన్స్​ వాడకం పెరిగింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. భయపడాల్సిందే. కారణం ఆ  ప్యాడ్స్​లో ఉండే హానికారక కెమికల్స్​. వాటివల్ల చాలామందికి అలర్జీలు, ఇన్ఫెక్షన్లు  వస్తున్నాయి. ప్లాస్టిక్​తో నిండిన ఆ ప్యాడ్స్​ ఏండ్ల తరబడి నేలపై చెత్తలా పేరుకుపోతున్నాయి కూడా. ఇవన్నీ తెలిసినప్పటికీ .. మరో ఆప్షన్​ తెలియక వాటినే వాడుతున్నారు చాలామంది. కానీ, ఆడవాళ్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే​ క్లాత్​ ప్యాడ్స్​​, మెనుస్ట్రువల్​ కప్స్​ ఉన్నాయి. అలాగే పిల్లలకి క్లాత్​ డైపర్లు వచ్చాయి. వీటిని తిరిగి వాడుకోవచ్చు కూడా. ఇదే విషయాన్ని అందరికీ చెప్పడానికి సిద్దిపేటలో ‘రుతు ప్రేమ’  కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సింథటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారు చేస్తారు. అవి​  మంచి వాసన రావడానికి పాలిథిలీన్, పాలీప్రొపైలిన్, ప్రొపైలిన్​ గ్లైకాల్​తో నిండిన ఆర్టిఫిషియల్​ ఫ్రాగ్రెన్స్​లని వాడతారు. అలాగే క్లోరో ఈథేన్, క్లోరో మీథేన్, నెయిల్​ పాలిష్​ రిమూవర్స్​లో ఉండే ఎసిటోన్, కారు టైర్ల తయారీలో వాడే స్టైరీన్​ ఉంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. శానిటరీ ప్యాడ్స్​ తయారీలో వాడే మరికొన్ని కెమికల్స్​ వల్ల  ఇన్​ఫెర్టిలిటీ, అండాశయ క్యాన్సర్, డయాబెటిస్​, డిప్రెషన్​, హార్మోనల్​ ఇంబాలెన్స్​ లాంటి సమస్యలు వస్తాయి. పైగా ఇవి భూమిలో కరగడానికి వేల సంవత్సరాలు పడుతుంది.  అలాకాదని కాల్చితే గాలి కలుషితం  అవుతుంది. అందుకే వీటికి బదులుగా ఉతికి మళ్లీ ఉపయోగించుకునే కాటన్​ ప్యాడ్స్​ వచ్చాయి. మెనుస్ట్రువల్​ కప్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో  ‘స్టోన్ సూప్’ అనే  సంస్థ సిద్దిపేట జిల్లా  అధికారులతో కలిసి పని చేస్తోంది.  

సైడ్ ఎఫెక్ట్స్​ ఉండవు

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కిందటి నెలల్లో ‘రుతు ప్రేమ’ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి రీయూజబుల్​ క్లాత్​ ప్యాడ్స్​,  డైపర్లు, మెనుస్ట్రువల్ కప్స్ గురించి చెప్తున్నారు. మహిళా ఉద్యోగులు, డ్వాక్రా గ్రూపు మహిళలకు, అంగన్​వాడీ టీచర్లకు, స్టూడెంట్స్​కి వీటి గురించి వివరిస్తున్నారు. వీటిని ఫ్రీగా పంచి పెడుతున్నారు కూడా.  అయితే ఈ క్లాత్​ ప్యాడ్స్​ని రెండేండ్ల వరకు, మెనుస్ట్రువల్​ కప్పులని ఎనిమిది నుంచి పదేండ్ల వరకు వాడుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​ ఉండవు.  పైగా  పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్తోంది స్టోన్​ సూప్​ సంస్థ. 

:: రఘునందన్ స్వామి,  సిద్దిపేట, వెలుగు