రెరా సెక్రటరి శివ బాల కృష్ణ ఇంట్లో ముగిసిన సోదాలు.. 90 ఎకరాలు..84 లక్షలు..

రెరా సెక్రటరి శివ బాల కృష్ణ ఇంట్లో ముగిసిన సోదాలు.. 90 ఎకరాలు..84 లక్షలు..

 మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇంటిపై  ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఆయన ఇంట్లో  భారీగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తులను కూడ బెట్టినట్లు తెలిపారు.  మణికొండ పుప్పాలగూడలోని ఇంట్లో  84 లక్షలకు పైగా నగదు సీజ్ చేశారు. 15 లక్షలకు పైగా విలువ చేసే 40 కి పైగా వాచ్ లు, 20కి పైగా ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2  కిలోల బంగారం, కోట్ల రూపాయల విలువ చేసే 90 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. అన్నీ కలిపి  300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు.  శివ బాలకృష్ణ పై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు.