సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన భారత్ గౌరవ్ ఏడో రైలు

సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన భారత్ గౌరవ్ ఏడో రైలు

సికింద్రాబాద్, వెలుగు: పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేకంగా నడుపుతున్న భారత్​గౌరవ్​ఏడో రైలు బుధవారం సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​నుంచి బయలుదేరింది. ఈ స్పెషల్​ట్రైన్​ను ఓ వృద్ధ ప్రయాణికురాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ దేశంలోని తూర్పు, ఉత్తర భాగాల్లోని పురాతన చారిత్రక ప్రదేశాలను సందర్శింపజేస్తుంది.  

మొత్తంగా 9 రోజుల్లో పూరీ, కోణార్క్​, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్​రాజ్​వంటి ముఖ్యమైన ప్రదేశాలకు వెళుతుందని ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ పి.రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రైన్ లోని ప్రయాణికులందరికీ రుద్రాక్ష మాలలు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​అరుణ్​కుమార్​జైన్ పాల్గొన్నారు.