స్టీవ్ జాబ్స్ పాత చెప్పులకు 1.77 కోట్లు

స్టీవ్ జాబ్స్ పాత చెప్పులకు 1.77 కోట్లు

పాత వస్తువులు సేకరించడం లాంటి విచిత్రమైన హాబీలు ఉన్నవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటివాళ్ల దగ్గర నుంచి సొమ్మ రాబట్టుకోవాలని చూస్తుంటాయి కొన్ని వేలం పాట కంపెనీలు. వేలంలో వింత వస్తువులు కొనుగోలు చేసి ఆనంద పడుతుంటారు కస్టమర్లు. అలాంటిదే అమెరికాలో జరిగింది. తన ఐడల్ యాపిల్ కంపెనీ ఫౌడర్ స్టీవ్ జాబ్స్ వేసుకున్న చెప్పుల్ని వేలం పాటలో కోటీ 77 లక్షలు పెట్టి కొనుకున్నారు. 

స్టీవ్ జాబ్స్ 1970 నుంచి 1980 మధ్య వేసుకున్న బిర్కెన్‌స్టాక్ అరిజోనా బ్రౌన్ లెదర్ సాండల్స్ పై అమెరికాలోని జూలియెన్స్ అనే కంపెనీ ఆదివారం వేలం పాట నిర్వహించింది. ఆ సాండల్స్ ని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి 1.77 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. యాపిల్ కంపెనీ మొదలుపెట్టిన మొదట్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులనే వేసుకున్నాడట. మొదటి యాపిల్ కంప్యూటర్ లాంచ్ చేసింది కూడా ఈ చెప్పులు వేసుకోనేనట. కొన్ని కీలకమైన మీటింగ్స్ కి కూడా ఈ చెప్పులు వేసుకునే వెళ్లాడని వివరాలు తెలిపింది జూలియెన్స్ కంపెనీ. ఇప్పటివరకు అమెరికాలోని చాలా ఎగ్జిబిషన్స్ లో ఈ చెప్పుల్ని డిస్ ప్లేకి ఉంచారు. అయితే.. వీటిని ఎవరు కొన్నారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది జూలియెన్స్ కంపెనీ.