
వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’. వెంకీకి ఇది 75వ చిత్రం. వెంకట్ బోయనపల్లి నిర్మాత. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు చేయగా, ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్‌గా నడుస్తూ ఆకట్టుకున్నారు. వెంకటేష్‌ను ఇందులో చాలా కొత్తగా చూస్తారన్నాడు శైలేష్ కొలను. వెంకటేష్ కెరీర్‌లోనే ఇది అత్యంత కాస్ట్లీ మూవీ అని, సౌత్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తామన్నారు నిర్మాత. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.