తాగడానికి డబ్బులిస్తలేదని తల్లిని చంపిన కొడుకు

తాగడానికి డబ్బులిస్తలేదని తల్లిని చంపిన కొడుకు

కొల్లాపూర్, వెలుగు: మద్యానికి డబ్బులివ్వలేదని కన్న తల్లిని చంపిండో కొడుకు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల నరికి తీసుకెళ్లాడు. పోలీసుల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో చంద్రమ్మ (65) తన కొడుకు రాముడుతో కలిసి ఉంటోంది . పింఛన్ డబ్బులతో పాటు కూలీనాలి చేసి కొడుకుకు వండిపెడుతోంది . కానీ, మద్యానికి బానిసైన రాముడు తాగడానికి డబ్బులు ఇవ్వమని తల్లిని రోజు వేధించే వాడు. శుక్రవారం రాత్రి కూడా మందుకు డబ్బులివ్వమని తల్లితో కొట్లాట పెట్టుకున్నాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో తల నరికి పారిపోయాడు. మరో కొడుకు కుర్మయ్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం , డాగ్ స్వ్కాడ్ తో వివరాలు సేకరిం చారు. కొల్లాపూ ర్‌ సీఐ వెం కట్ రెడ్డి మూడు టీం లను ఏర్పాటు చేసి .. గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.