అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. 174 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే 2024, ఏప్రిల్ 7 ఆదివారం తెల్లవారుజామున ఎస్ఓటీ మాదాపూర్ టీం గచ్చిబౌలి పరిధిలో రైడ్ చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న సీ. హనుమంతుడు S/o అంజయ్య, ప్రదీప్ s/o కృష్ణ స్వామి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ప్రదీప్ పాయిజన్ వైన్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్రమంగా మద్యం తరలించడం మొదలు పెట్టారు. అక్రమ మద్యం పై కన్నేసిన ఎస్ఓటీ టీం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు గచ్చిబౌలి పోలీసులు.