ఈ రాళ్లు  గంటలు మోగిస్తయ్‌‌‌‌‌‌‌‌!

ఈ రాళ్లు  గంటలు మోగిస్తయ్‌‌‌‌‌‌‌‌!

‘రాళ్లతో ఏం చేస్తారు?’ అని అడిగితే ... ‘ఇల్లు కట్టడానికి వాడతారు. శిల్పాలు చెక్కుతారు’ అని రకరకాల జవాబులు చెప్తారు. కానీ, ఈ రాళ్లు అన్ని రాళ్లలా కాదు. వీటికో స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫీచర్ ఉంది. రాళ్లకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫీచర్ ఏంటి? అంటున్నారా. అయితే ఇది చదవాల్సిందే.

గుజరాత్‌‌‌‌‌‌‌‌, బనస్కాంటా జిల్లాలోని ఖునియా అనే ఊళ్లో ఉన్న కొండపైన ఈ ప్రత్యేకమైన రాళ్లు ఉన్నాయి. ఎవరో పేర్చినట్టు ఉన్న ఈ రాళ్లను ఇంకొక రాయితో కొడితే గంటలు మోగిన శబ్దాలు వస్తాయి. ఈ కొండను ‘కాలాపత్తర్​’ అని పిలుస్తారు అక్కడి ప్రజలు. ఈ కొండలో చాలా గుహలు ఉన్నాయి. వాటిలో ఇదివరకు మునులు తపస్సు చేసే వాళ్లని, అందుకే ఈ రాళ్లకు ఈ శక్తులు వచ్చాయని నమ్ముతారు అక్కడి వాళ్లు. కానీ ఇందులో సైన్స్ ఉంది. అదేంటంటే...

‘సాధారణంగా రాళ్లు ఇసుక, రాయి కలిసి తయారవుతాయి. కానీ ఇక్కడి రాళ్లు మాత్రం ఇనుము, రాయి కలిసి తయారయ్యాయి. జియాలజీ పరంగా వీటిన లిథోఫోనిక్ రాళ్లు అంటారు. ఈ రాళ్లలోపల పగుళ్లు ఉంటాయి. ఆ సందుల నుండి గాలిపోయి, వాటిని కొట్టినపుడు  గంటల శబ్దం వస్తుంది. దీనికి అందులో ఉన్న ఇనుము సాయపడుతుంది’  అని జియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ దేవల్‌‌‌‌‌‌‌‌ గజ్జర్ చెప్పింది. మన దేశంలో ఇలాంటి రాళ్లు గుజరాత్‌‌‌‌‌‌‌‌తో పాటు  మహారాష్ట్ర, తమిళనాడులో కూడా ఉన్నాయి. మన తెలంగాణలో జనగామ, సిద్దిపేటల్లో ఇవి కనిపిస్తాయి.