అపుడు బాలుని లోపలికి వెళ్లనివ్వలే..

అపుడు బాలుని లోపలికి వెళ్లనివ్వలే..

మొదటి పాట పాడటానికి బాలు వెళ్లినప్పుడు ఓ సరదా సంఘటన జరిగింది. విజయ గార్డెన్స్‌‌లో రికార్డింగ్‌‌. బాలు తన ఫ్రెండ్‌‌ సైకిల్‌‌ మీద వెనకాల కూర్చుని వెళ్లారు. కానీ లోపలికి రానివ్వలేదు. రికార్డింగ్ ఉంది వెళ్లనివ్వమని అడిగితే.. ఇంత చిన్నపిల్లాడు పాట పాడటమేంటని నో అన్నాడట గేట్‌‌మేన్. రికార్డింగ్‌‌ అసిస్టెంట్‌‌ బైటికొచ్చి విషయం చెబితేగానీ ఆరోజు బాలుని లోనికి రానివ్వలేదట. ఆయన ఫేమస్ అయ్యాక కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఓసారి విజయవాడలో ఇళయరాజా, ఎస్పీబీల ప్రోగ్రామ్‌‌ ఉంది. బాలు తిరుమలలో తలనీలాలు ఇచ్చుకుని రావడం లేటయ్యింది. జనం గొడవ చేయడంతో రాజా ప్రోగ్రామ్‌‌ మొదలుపెట్టేశారు. కాసేపటికి వచ్చిన బాలుని వాచ్‌‌మేన్ గుర్తు పట్టలేదు. లోనికి వెళ్లడానికి వీల్లేదన్నాడు. ‘నేను బాలసుబ్రహ్మణ్యాన్ని, వెళ్లి పాటలు పాడాలి’ అన్నారు బాలు. ‘ప్రతి ఒక్కడూ బాలు, ఘంటసాల అని చెప్పేవాడే’ అంటూ వెటకారమాడాడు తప్ప లోపలికి మాత్రం వెళ్లనివ్వలేదతను. దాంతో ఎలాగో తంటాలుపడి వెనక గేటు నుంచి లోని కెళ్లారు బాలు. ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. తర్వాత వాచ్‌‌మేన్ వచ్చి క్షమించమని అడిగితే.. ‘నీ తప్పేముంది.. వెంటనే గుర్తు పట్టడానికి నేనేమైనా హీరోనా.. పైగా గుండు వల్ల అస్సలు గుర్తు పట్టి ఉండవు’ అంటూ నవ్వేశారట బాలు

వీరాట్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్‌

రైల్వే జాబ్ కొట్టాలంటే.. ఈ అంశాలపై ఫోకస్ పెట్టండి

నేను డ్రగ్స్ వాడలే.. జస్ట్ చాట్ చేశా