ఒక్కటిగా ముందుకు సాగుదాం

ఒక్కటిగా ముందుకు సాగుదాం

ఒక్కటిగా ముందుకు సాగుదాం

సీసీఐ, సీపీఎం సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : ఇకపై మరింత ధృడంగా ఐక్యంగా వ్యవహరించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. సీపీఐ, సీపీఎం పార్టీల రాష్ట్ర ముఖ్య నాయకులు మార్చి 12న ఆదివారం హైదరాబాద్​లోని ఎంబీ భవన్‌‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు, బాధ్యతల గురించి సమావేశంలో చర్చించారు. మార్చిలో సీపీఎం.. ఏప్రిల్‌‌, మే నెలల్లో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న ప్రచారోద్యమాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌‌ 9న హైద్రాబాద్‌‌లో సీపీఎం, సీపీఐ పార్టీల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో తమ్మినేని తదితరులు పాల్గొన్నారు.