
- కొత్త నిర్మాణాలకు అనుమతులిచ్చే బాధ్యతలు
- లేఔట్స్, వెంచర్స్‌కు పర్మిషన్లు కూడా అథారిటీదే
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు దీటుగా నిర్మాణం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల స్పెషల్‌గా ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని రూపురేఖలు, నిర్మా ణం ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు చెప్పిన వివరాల మేరకు.. హెచ్ఎండీఏ మాదిరిగానే ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్ఎండీఏకు ఉన్నట్టుగానే ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్అథారిటీకి కమిషనర్గా ఐఏఎస్ ను నియమించారు.
ప్లానింగ్, ఇంజినీరింగ్వంటి ప్రధాన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ మాదిరిగానే ఎఫ్సీడీఏకు సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హెచ్ఎండీఏ దాదాపు13 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఎఫ్‌సీడీఏ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో ఫ్యూచర్‌సిటీని అవసరాలకు అనుగుణంగా విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోనే ఏర్పాటయ్యే ఫ్యూచర్‌సిటీ దశల వారీగా అభివృద్ధి చేసి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ విధులు ఇలా..
ఫ్యూచర్ సిటీలోకి మహబూనగర్ జిల్లా ముచ్చెర్ల, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మహేశ్వరం, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వస్తున్నాయి. దీంతో ఇటు శ్రీశైలం హైవే, అటు మహబూబ్‌నగర్‌వైపు భారీగా అభివృద్ధి జరిగే చాన్స్ ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్అథారిటీ ఫ్యాబ్‌సిటీలో కానీ, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, శంషాబాద్ పరిధిలో కొత్త లే అవుట్లకు కానీ, వెంచర్లకు, భారీ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వనుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలు కూడా ఫ్యూచర్‌సిటీ అథారిటీకే ఉంటుంద ని పేర్కొన్నారు.
అభివృద్ధే లక్ష్య్యంగా అథారిటీ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఫ్యూచర్‌సిటీ లో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర నిర్మాణాలకు అనుమతులను కూడా అథారిటీనే ఇవ్వనుంది. రాబోయే రోజుల్లో ఎఫ్‌సీడీఏ పరిధిలో హైరైజ్ భవనాల ను నిర్మించే సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐటీ, మెడికల్ఇన్ఫ్రాస్ర్టక్చర్తో పాటు భారీ ఎత్తున మల్టినేషనల్సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిటీలకు దీటుగా ఫ్యూచర్ సిటీ ఉండబోతున్నట్టు అధికారులు తెలిపారు.