వజ్రోత్సవాల్లో భాగంగా ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన

వజ్రోత్సవాల్లో భాగంగా ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన

హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవాలు) పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు ‘‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ’’ వేడుకలను నిర్వహించనుంది. అందులో భాగంగా  విద్యార్థులో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు ఈ నెల 9 నుంచి 11 వరకు, 16 నుంచి 21 వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో గాంధీ మూవీని ఉచితంగా ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు గాంధీ మూవీ ప్రదర్శన ఉంటుందని సర్కార్ తెలిపింది. సాధారణ థియేటర్లతోపాటు మల్టీఫ్లెక్స్ థియేటర్ల వరకు... ప్రతి థియేటర్ లో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాలని ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది. 

కాగ... వజ్రోత్సవాల్లో భాగంగా రోజువారి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఆగస్టు 08 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ’  ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం.
ఆగస్టు 10 : గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
ఆగస్టు 11 :  ఫ్రీడం రన్ నిర్వహణ
ఆగస్టు 12 :  మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక  వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళల ఆధ్వర్యంలో వజ్రోత్సవ ర్యాలీలు
ఆగస్టు 14 : నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు
ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
ఆగస్టు 16 :  జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ.
ఆగస్టు 18 : ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు,  ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ
ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు
ఆగస్టు 21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
ఆగస్టు 22 : ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు