18 రోజుల్లోనే 2 వేల కోట్లిచ్చిన సర్కార్

18 రోజుల్లోనే 2 వేల కోట్లిచ్చిన  సర్కార్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దళిత బంధు పథకం పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా కరీంనగర్‌‌‌‌ జిల్లాలోని హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గానికి ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ ద్వారా కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో డబ్బులు జమ చేశారు. రాష్ట్ర సర్కార్ హుజూరాబాద్‌‌‌‌ లో స్కీమ్ అమలుకు 18 రోజుల్లోనే మొత్తం రూ.2వేల కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఈ నెల 9న రూ.500 కోట్లు, 23న రూ.500 కోట్లు, 24న రూ.200 కోట్లు, 25న రూ.300 కోట్లు, గురువారం మరో రూ.500 కోట్లు రిలీజ్‌‌‌‌ అయ్యాయి. హుజూరాబాద్‌‌‌‌లో ఇటీవల దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రారంభించారు. నియోజకవర్గంలో స్కీం అమలు కోసం మొత్తం 2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. సమగ్ర సర్వే రిపోర్ట్‌‌‌‌ ప్రకారం హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించనున్నారు. హుజూరాబాద్‌‌‌‌కు నిధులు విడుదల చేసిన సర్కారు ఇక లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.