భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు ప్రభుత్వ రిపోర్ట్

భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు ప్రభుత్వ రిపోర్ట్

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్టును పిటిషనర్లకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికపై బుధవారం (ఆగస్టు 9న) హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. గతంలో సమర్పించిన రిపోర్టు అసంపూర్తిగా ఉందని.. సమగ్ర నివేదిక తయారు చేసి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో మరోసారి నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 

నివేదికలోని అంశాలు ఇవే.. 

* రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 49 మంది మృతి

* భారీ వరదలు ఉన్న ప్రాంతాల్లో 10 ఎన్టీఆర్ఎఫ్ టీమ్స్, రెండు హెలికాప్టర్స్, 27 బోట్స్ ద్వారా సహాయక చర్యలు చేపట్టాం 
 

* రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ కు సెలవులు ప్రకటించాం

* 177 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 11 వేల 748 మందికి ఫుడ్, మెడిసిన్స్ అందించాం 

* సచివాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాం

* టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం 

* వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం 

* రాష్ట్ర వ్యాప్తంగా 548 చోట్ల రోడ్లు దెబ్బతినగా.. అందులో 471 స్టేట్ రోడ్స్ ఉన్నాయి. వీటిలో 18 రోడ్లను పునరుద్ధరించాం. మిగతావి చేస్తున్నాం 

* 773 గ్రామాల్లో కరెంట్ సప్లై ఆగిపోగా..72 గ్రామాల్లో పవర్ రిస్టోర్ చేశాం 

* భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు రాకుండా మెడికల్ సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకున్నారు

ALSO READ :అమెరికాలో తుఫాన్ బీభత్సం.. వేల విమానాలు రద్దు.. లక్షల మందికి కరెంట్ కట్