
హైదరాబాద్, వెలుగు : ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారం మూడో రోజు కొనసాగింది. శానిటేషన్ , ఎంటమాలజీ వర్కర్స్‌తో పాటు వివిధ విభాగాల కార్మికులు పాల్గొన్నారు.
సోమవారం నుంచి పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తామని యూనియన్ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ హెచ్చరించారు. ఆదివారం ఉప్పల్ సర్కిల్ లో సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మె ఆగదని ఆయన స్పష్టం చేశారు.