సార్ పాస్ చేయండి.. లేకపోతే పెళ్లి చేస్తారు.. విద్యార్థుల వింత కోరికలు

సార్ పాస్ చేయండి.. లేకపోతే పెళ్లి చేస్తారు.. విద్యార్థుల వింత కోరికలు

ఎగ్జామ్స్ అనగానే.. తాము పాస్ అవుతామో లేదోనని ఒకటే కంగారు పడుతుంటారు పలువురు విద్యార్థులు. తమను పాస్ అయ్యే విధంగా చేయాలని కొంతమంది గుళ్ల చుట్టూ తిరుగుతారు. మరికొంతమంది వినూత్నంగా ప్రయత్నిస్తారు. ఎగ్జామ్స్ పేపర్ లో వింత కోరికలు కోరుతుంటారు. దయచేసి తమను పాస్ చేయాలని.. లేకపోతే జీవితం పాడై పోతదని, మంచి మార్కులు వేయలేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటు చేసుకుంది. 

అక్కడి రాష్ట్రంలో ఇటీవలే పది, ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటిని విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపడుతున్నారు. ఒక్కో పేపర్ లో విద్యార్థులు రాసినవి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. తనకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదని.. పాస్ మార్కులు వేయాలని ఓ విద్యార్థి కోరాడు. సార్.. తాను రాసిన సమాధానంలో తప్పులుంటే క్షమించాలని.. మీ కూతురిలా భావించి పాస్ చేయండని ఓ విద్యార్థిని కోరింది. తన తండ్రి బాగా తాగుతాడని.. సవతి తల్లి చిత్ర హింసలకు గురి చేస్తోందని.. ఇంటర్ విద్యార్థిని రాసింది.

ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కాకపోతే.. తనకు వివాహం చేస్తాడని ఆ విద్యార్థిని వాపోయింది. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి దయానంద్ సిహాగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 10, 12వ తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనం జరుగుతోందని.. సమాధాన పత్రాలపై అనవసర రాతలు రాస్తున్నారని తెలిపారు. ఇలాంటి పనులు చేయరాదని విద్యార్థులకు క్లాసుల్లో చెప్పాలని ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం :

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్ 

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్,ఎన్సీపీకి సీఎం భయపడుతున్నారు