ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి

ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని మూఢనమ్మకాల చట్ట సాధన సమితి డిమాండ్ చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణాల పట్ల ప్రజలకు ఉండే భయాందోళనలు, అపోహలు తొలగించడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి  ఆధ్వర్యంలో గ్రహణ చంద్రుని తో సెల్ఫీ విత్ భోజనం కార్యక్రమాని నిర్వహించారు. 

జ్యోతిష్యులు చెప్పే  మాటలు నమ్మకుండా ఉండడానికి ప్రజలను చైతన్యం చేస్తున్నామని నిర్వాహకులు  తెలిపారు. గ్రహణం చూడటం వలన, గ్రహణ సమయంలో తినడం వలన ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపారు. కేవలం జ్యోతిష్కులు తమ స్వార్థం కోసం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి నిర్వాహకుడు రమేష్  తెలిపారు. ప్రభుత్వం వెంటనే మూఢ నమ్మకాల చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.