ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ 2023 మే నెలాఖరున తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. హైకోర్టు ఉత్తర్వులను వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సవాలు చేసింది. సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం విచారణ చేపట్టింది.

కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. పిటిషనర్ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.