2020 పంట నష్టంపై కేసులో తెలంగాణ సర్కార్‌‌‌‌కు సుప్రీం ప్రశ్న

2020 పంట నష్టంపై కేసులో తెలంగాణ సర్కార్‌‌‌‌కు సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు : 2020 అక్టోబర్‌‌‌‌లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేలా తీసుకున్న చర్యలేంటో చెప్పా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ఇన్‌‌పుట్ సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదని రైతు సంఘం నేత విస్సా కిరణ్ కుమార్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న హైకోర్టు 3నెలల్లో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు సబ్సిడీ అందజేయాలని అప్పట్లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, కిరణ్​కుమార్, ఇతరులకు నోటీసులు జారీ చేసింది.