అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌ కు సుప్రీంకోర్టు షాక్

అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌ కు సుప్రీంకోర్టు షాక్

ముంబై : మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్‌ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాత్కాలికంగా జైలు నుంచి విడుదలై.. మహారాష్ట్రలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించింది. ప్రస్తుతం దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మహారాష్ట్రకు చెందిన మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇద్దరు నేతలకు ఓటు వేసేందుకు జైలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ శుక్రవారం (జూన్ 17న) బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సోమవారం (జూన్ 20న) మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.