ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్లు.. ఆగస్టు 2నుంచి పూర్తిస్థాయి విచారణ

ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్లు.. ఆగస్టు 2నుంచి పూర్తిస్థాయి విచారణ

జమ్మూ- కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం (జులై 11న) విచారణ జరిగింది. పిటిషన్లను పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణను చేపట్టనున్నట్లు వెల్లడించింది. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన విషయం తెలిసిందే. జమ్మూ- కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.