జీడిమెట్ల, వెలుగు: తాళం వేసిన ఇండ్లు, ఆఫీస్‌లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని బాలానగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. సంబంధిత వివరాలను డీసీపీ సురేశ్కుమార్మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఏపీలోని బాపట్లకు చెందిన గోనిగుంట వంశీకృష్ణ(32) బతుకుదెరువు కోసం జగద్గిరిగుట్ట అల్విన్కాలనీకి వచ్చాడు. క్యాబ్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వెస్ట్‌గోదావరి జిల్లా పెద్దపాడు మండలం వల్తూరుకు చెందిన మట్ట భరత్ రాజీవ్‌గాంధీ అలియాస్భరత్కూడా ఇదే కాలనీలో ఉంటూ బైక్మెకానిక్గా చేస్తున్నాడు.
ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం చోరీలు చేయాలని నిర్ణయించుకొని, తాళం వేసిన ఇండ్లు, ఆఫీస్‌లను టార్గెట్చేస్తున్నారు. ఈ నెల 2న బాలానగర్‌లోని లిఫ్ట్ట్రేడ్ప్రైవేట్లిమిటెడ్ షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు వంశీకృష్ణ, భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 4, కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో 1, మియాపూర్ఠాణా పరిధిలో1 మొత్తం 7 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.27 లక్షలు, బైక్, వాచ్, 53 గ్రాముల గోల్డ్కోటెడ్సిల్వర్ గాజులు, రోల్డ్గోల్డ్నెక్లెస్, 2 ఫోన్లు, 2 ఐరన్‌రాడ్లను స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్ట్‌చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. బాలానగర్, కేపీహెచ్‌బీ ఠాణాల పరిధిలో వారు పని చేసిన కంపెనీల్లోనే చోరీ చేశారని తెలిపారు.

