
వరుసగా మాస్ సినిమాలపై ఫోకస్ పెడుతోన్న రామ్, ప్రస్తుతం ‘ద వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్. జూలై 14న సినిమా రిలీజ్ కానుండగా రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్‌పై దృష్టి పెట్టారు మేకర్స్. ఈ నెల 14న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. తన క్యారెక్టర్ పేరు సత్య అని రివీల్ చేశారు. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు రామ్. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న అతనికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయనేది మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్స్‌ను కూడా ఎంతో స్టైలిష్‌గా తీస్తాడని పేరున్న లింగుస్వామి, రామ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడా అనే అంచనాలున్నాయి. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.