ఆటో క్యాబ్ లారీ యూనియన్  జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

ఆటో క్యాబ్ లారీ యూనియన్  జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్: ఫిట్నెస్ లేని రవాణా వాహనాలకు కేంద్ర ప్రభుత్వం విధించిన పెనాల్టీ లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆటో క్యాబ్ లారీ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్ లోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయాన్ని జేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు ముట్టడించాయి. గంటకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో  భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో వాహనాలపై ప్రతిరోజు 50 రూపాయలు పెనాల్టీ వేయడాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని అన్నారు. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రెండు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ సింగిల్ పర్మిట్ ఇవ్వడంతోపాటు జీవో నెంబర్ 61, 66 ను సవరించి అన్ని రకాల జాబ్ లకు వర్తింపజేయాలని కోరారు. తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఆటో క్యాబ్ లకు ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

లండన్ టూర్ లో బిజీబిజీగా కేటీఆర్

బోయిగూడలో కూలిన స్క్రాప్ గోడౌన్ గోడ