లండన్ టూర్ లో బిజీబిజీగా కేటీఆర్

లండన్ టూర్ లో బిజీబిజీగా కేటీఆర్

మంత్రి కేటీఆర్ లండన్ టూర్ లో బిజీబిజీగా ఉన్నారు. యూకేఐబీసీ-ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎటక్ట్రిక్ వెహికిల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. రాష్ట్రంలో సమగ్రమైన, ప్రగతిశీల ఈవీ పాలసీని ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని కేటీఆర్ గుర్తుచేశారు.


కాగా ఈనెల 17న లండన్ వెళ్లారు  కేటీఆర్. అక్కడి నుండి ఈ నెల 22న స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్లనున్నారు. 22 నుంచి 26 వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఈ సదస్సులో వివిధ దేశాల రాజకీయ,వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు. ఇక ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచఆర్థిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 16న తిరిగి ఆయన రాష్ట్రానికి చేరుకోనున్నారు.

మరిన్ని వార్తల కోసం

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది