బోయిగూడలో కూలిన స్క్రాప్ గోడౌన్ గోడ

బోయిగూడలో కూలిన స్క్రాప్ గోడౌన్ గోడ

బోయిగూడలో గతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. మార్చి 23వ తేదీన ఓ గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరోక ప్రమాదం జరిగింది. కానీ..ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 2022, మే 19వ తేదీ గురువారం ఓ స్క్రాప్ గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయిగూడలో ఓ స్క్రాప్ గోదాం ఉంది. ఇక్కడ గోడౌన్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో స్కూటీపై వెళుతున్న ఓ వాహనదారుడు తృటిలో తప్పించుకోవడంతో అతనికి ప్రమాదం తప్పింది.

గోడ కూలిన దృశ్యాలు సమపీ సీసీ పుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. గోడ కూలిన విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. గతంలో  ఈ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరగడంతో రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు ప్రహారీ గోడ కూలింది. గతంలో జరిగిన స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పిన GHMC నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోసారి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు బల్దియా సిబ్బంది ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని కొంతమంది వెల్లడిస్తున్నారు. ప్రమాదం జరిగి రెండు నెలలు కావస్తోందని.. స్క్రాప్ గోదాంను నేలమట్టం చేస్తామని చెప్పి చేతులు దులుపుకొందని వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా గోదాంలపై దృష్టి సారించి.. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం : -

రాష్ట్రంలో ఆటో,క్యాబ్స్ బంద్..టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్


దొరల పాలనకు చరమ గీతం పాడాల్సిందే