తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

ఢిల్లీ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చిన పిటిషన్ విషయంలో జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ ఎమ్ సుందరేష్ ధర్మాసనం విచారణ జరిపింది. "తాగునీటి ప్రాజెక్టు" పనులు మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. 7.15 టీఎంసీల తాగునీరు పనులు కొనసాగించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. మరోవైపు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎన్ జీటీ విధించిన 900 కోట్ల జరిమానాపై స్టే విధించింది.