దేశంలోనే టాప్: తెలంగాణకు భూములే అతిపెద్ద ఆస్తి.. ప్రభుత్వం వద్ద 76 వేల ఎకరాలు..

 దేశంలోనే టాప్: తెలంగాణకు భూములే అతిపెద్ద ఆస్తి.. ప్రభుత్వం వద్ద 76 వేల ఎకరాలు..
  • మన తర్వాతే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు
  • ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో వెల్లడి
  • రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రెడీగా భూములు 
  • క్లస్టర్ల వారీగా కేటాయింపులు.. సౌలతుల కల్పన 
  • భారీగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం 
  • ఫ్యూచర్ సిటీ వైపు పారిశ్రామిక దిగ్గజాల చూపు 
  • ఈ అంశాలన్నీ దావోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదస్సులో కలిసొచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ప్రభుత్వ భూములే అతిపెద్ద ఆస్తిగా మారాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 76 వేల ఎకరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఏకంగా 30,749 హెక్టార్ల (దాదాపు 76 వేల ఎకరాలు) భూమి తక్షణమే అందుబాటులో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (పీవోఐఏఐటీ) వెల్లడించింది. ఈ మేరకు ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ పేరుతో నివేదిక విడుదల చేసింది.

 దిగ్గజ పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా వెనక్కినెట్టి దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అందులో పేర్కొంది. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉండడంతో తెలంగాణకు భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపింది.  పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కడ స్థలం దొరుకుతుందా? అని వెతుక్కోవాల్సిన పని లేకుండా, ప్లగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం భూములను సిద్ధం చేయడమే ఇందుకు కారణమని పేర్కొంది. 

దేశవ్యాప్తంగా పారిశ్రామికవాడల మ్యాపింగ్​.. 

కేంద్రం అభివృద్ధి చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్..  జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్​) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవాడలను మ్యాపింగ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో మొత్తం 157 ఇండస్ట్రియల్ పార్కులు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 32,033 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో పరిశ్రమల కోసం కేటాయించడానికి వీలుగా 30,749 హెక్టార్లు అంటే 75,980 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. పెట్టుబడిదారులు కోరుకున్న వెంటనే భూమిని కేటాయించే వెసులుబాటు ఉండటంతో, అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ వైపు చూస్తున్నాయి. 

భూసేకరణ సమస్యలు లేకుండా ఇంత భారీ మొత్తంలో భూములు అందుబాటులో ఉండటమే రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందనుకునే మహారాష్ట్రలో 523 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పటికీ, అక్కడ అందుబాటులో ఉన్న భూమి  సుమారు 48,575 ఎకరాలు మాత్రమే. అలాగే తమిళనాడులో సుమారు 40,255 ఎకరాలు, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 31,147 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 638 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పటికీ, అక్కడ తక్షణ వినియోగానికి 26,555 ఎకరాలు మాత్రమే లభ్యతలో ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 

క్లస్టర్ల వారీగా కేటాయింపు

కేవలం భూమి ఉండటమే కాదు, ఏ రంగానికి ఎక్కడ అనుకూలమో ప్రభుత్వం ముందుగానే గుర్తించి క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నది. అందుబాటులో ఉన్న ఈ 76 వేల ఎకరాల్లో.. ఫార్మాసిటీ, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కాలుష్య రహిత జోన్లను, జహీరాబాద్, సీతారాంపూర్ వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), ఆటోమొబైల్ రంగానికి భారీ భూములను కేటాయిస్తున్నది. మరోవైపు మహేశ్వరం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు భూములు రెడీగా ఉన్నాయి. టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్ కోసం వరంగల్ వైపు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూములను మార్క్ చేశారు. ఇలా సెక్టార్ల వారీగా భూములను విభజించడంతో ఒకేచోట అనుబంధ పరిశ్రమలు  వచ్చి పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

బిగ్గెస్ట్​ ఇన్వెస్ట్ ఏరియాగా ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ఈ భూములే ప్రధాన పెట్టుబడి కానున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రాంతం బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ ఏరియాగా అవతరించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అత్యంత చేరువలో ప్రభుత్వం చేపట్టిన ఈ ఫ్యూచర్ సిటీ.. భూముల లభ్యతలో గేమ్ ఛేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారనుంది. ఫ్యూచర్ సిటీని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా.. ‘వర్క్, లివ్, ప్లే’ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, రోబోటిక్స్ వంటి అత్యాధునిక  టెక్నాలజీ పరిశ్రమలకు కేటాయించనున్నారు. 

ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, స్కిల్స్ యూనివర్సిటీ వంటివి ఇక్కడే వస్తుండటంతో.. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలకు తావులేకుండా, గ్రీన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇక్కడ పెద్దపీట వేస్తుండటం గమనార్హం. కేవలం భూమిని చూపించడమే కాకుండా.. రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సదుపాయాలతో ఇన్వెస్టర్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోంది. కేంద్రం పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ వివరాలన్నీ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో విదేశీ కంపెనీలు సులభంగా ఇక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నాయి.

దావోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిసొచ్చే చాన్స్..​ 

త్వరలో జరగనున్న దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సిద్ధమవుతున్న సర్కారుకు ‘పీవోఐఏఐటీ’  విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టు మరింత బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. ‘మా దగ్గర భూమికి కొదవ లేదు.. అనుమతులకు ఆలస్యం లేదు’ అంటూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా 76 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్న విషయం గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెద్ద భరోసా ఇస్తుందని ఇండస్ర్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా భూసేకరణకే ఏండ్లకేండ్లు సమయం పడుతుండగా, రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే స్వయంగా క్లియరెన్సులతో కూడిన భూమిని చేతిలో పెడుతుండటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. 

రాష్ట్రంలో 157 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నప్పటికీ, డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా మరిన్ని కొత్త క్లస్టర్లను అభివృద్ధి చేయాని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. భారీగా అందుబాటులో ఉన్న ఈ  భూముల్లో పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోనుంది. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ భూముల్లో పూర్తిస్థాయిలో పరిశ్రమలు వస్తే.. వచ్చే ఐదేండ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోనూ భూములు సిద్ధంగా ఉండటంతో.. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయి.

పెట్టుబడులకు రెడ్​కార్పెట్..

భూముల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమ పెట్టాలంటే భూసేకరణకే రెండేండ్లు పడుతుంది. కానీ తెలంగాణలో ప్రభుత్వమే లిటిగేషన్లు లేని క్లియర్ టైటిల్ భూములను సిద్ధంగా ఉంచడంతో కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్న నెల రోజుల్లోనే పనులు ప్రారంభించేందుకు వీలుంది. 

ఈ ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానమే విదేశీ కంపెనీలను ఆకర్షిస్తోందని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్న ఇండస్ట్రియల్ పార్కులను చూపిస్తుండడంతో.. ఇన్వెస్టర్లు వెంటనే నిర్ణయం తీసుకోగలుగుతున్నారని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగకుండా ఉండడంతో పాటు, త్వరగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని  విశ్లేషిస్తున్నారు.