ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్.. భ‌ద్ర‌త‌ను పెంచిన ప్రభుత్వం

ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్.. భ‌ద్ర‌త‌ను పెంచిన ప్రభుత్వం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం భ‌ద్ర‌త‌ను పెంచింది. ఇటీవల ఢిల్లీలో అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. దీంతో తెలంగాణ పోలీసులు అలర్టయి.. రాజాసింగ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాజాసింగ్‌ను బైక్‌పై తిరగవద్దని సీపీ సూచించారు. రాజాసింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కార్‌లోనే వెళ్లాలని స్పష్టంచేశారు. డీసీపీ స్థాయి అధికారి రాజాసింగ్ భద్రతా పర్యవేక్షిస్తారని సీపీ తెలిపారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్… తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాన‌ని తెలిపారు. గతంలో హైదరాబాద్ సీపీ కి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాసిన‌ట్టు తెలిపిన రాజాసింగ్.. గన్ లైసెన్స్ మంజూరు చేయాల‌న్నారు. నియోజకవర్గంలోని స్లామ్ ఏరియాల‌కి వెళ్లాలంటే కార్లో వెళ్లలేని పరిస్థితి ఉంది కాబట్టి.. ఎవరితో త‌న‌కు ముప్పు ఉందో అనే విషయాన్ని ధైర్యంగా తెలియపరచాలని కోరుతున్నాన‌ని అన్నారు. ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.