అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్కులు పెట్టుకోని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ర్యాలీలు, ఒకేచోట ప్రజలు  గుంపులుగా ఉండటంపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పార్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ వేడుకలు నిర్వహించొద్దని సూచించింది. రూల్స్ బ్రేక్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా రూల్స్ అమలయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, పోలీస్  కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.